చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు మరొకలా మాట్లాడుతున్నారు

Thursday, September 10th, 2020, 03:01:36 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతి పక్ష పార్టీ నేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ కి చెందిన నేతలు వరుస విమర్శలు చేస్తున్నారు. అయితే తాజాగా ఆ పార్టీ కో చెందిన మల్లాది విష్ణు పలు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు వైఖరి పై ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నప్పుడు జరిగిన పరిణామాల పై మల్లాది విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు.

40 దేవాలయాలను కూల్చివేసిన చంద్రబాబు నాయుడు, అప్పుడు ఎందుకు నిజ నిర్దారణ కమిటీ వేయలేదు అని సూటిగా ప్రశ్నించారు. ప్రభుత్వం కి కులాల, మతాలు అంటగట్టి, రాజకీయ లబ్ది పొందాలని చంద్రబాబు చేస్తున్నారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు.చంద్రబాబు నాయుడు అధికారం లో ఉన్నప్పుడు ఒక విధంగా లేనప్పుడు మరొక విధంగా మాట్లాడుతున్నారు అని ఘాటు విమర్శలు చేశారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి అన్ని కులాలు, మతాలు సమానమే అని మల్లాది విష్ణు అన్నారు.ప్రభుత్వం కి మతాలతో సంబంధం లేదు అని తేల్చి చెప్పారు.