చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు మానుకోవాలి

Saturday, November 7th, 2020, 04:21:53 PM IST

వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనా విధానం పై ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి బాటలు వేస్తున్నారు అని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే ప్రజలు తిరస్కరించినా కూడా చంద్రబాబు కి ఇంకా బుద్ది రాలేదు అంటూ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు ఉచితంగా ఇచ్చే ఇళ్లను కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారు అంటూ ధ్వజమెత్తారు. విజయవాడ లో పేద ప్రజలకు 12,500 ఇళ్లు ఇస్తాం అని చెప్పి, లక్ష రూపాయలు వసూలు చేసిన చరిత్ర తెలుగు దేశం పార్టీ ది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు అచ్చం నాయుడు, బోండా ఉమా, గద్దె రామ్మోహన్ ప్రజలకు ఏం చేశారు అంటూ సూటిగా ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ళ కేటాయింపు విషయం లో టీడీపీ నేతలు కొత్త నాటకాలకు తెరలేపారు అని, టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారు అని, అసత్య ఆరోపణలు మానుకోవాలి అంటూ మల్లాది విష్ణు హితవు పలికారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.