కమల్ హాసన్ తో మజ్లిస్ పొత్తు…తమిళనాట సత్తా చాటేనా?

Tuesday, December 15th, 2020, 09:24:56 AM IST

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మరొకసారి మజ్లిస్ పార్టీ తన హవా కొనసాగిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ లో తన సత్తా చాటింది. బీహార్ ఎన్నికల్లో సైతం మజ్లిస్ పార్టీ గట్టి కోటి పోటీ ఇచ్చింది. అయితే తమిళ నాట రాబోయే ఎన్నికల్లో ప్రముఖ నటుడు కమల్ హాసన్ తో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం తమిళనాడు లో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మజ్లిస్ పార్టీ పోటీ కి సిద్దం అయ్యేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే కమల్ మరియు మజ్లిస్ పార్టీలు ఇద్దరు కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు అని తెలుస్తోంది. పోటీ చేయాల్సిన ప్రాంతాల నుండి మాత్రమే కాకుండా, అందుకు తగ్గట్లు గా గెలిచే విధంగా వ్యూహాలను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే తమిళ నాట ఇప్పటికే పలు ముస్లిం పార్టీ లు ఉన్నప్పటికీ వారందరినీ ఓకే తాటి పైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే.