శ్రీలంక అధ్యక్షుడుగా మైత్రిపాల శిరిసేన ఎన్నిక!

Friday, January 9th, 2015, 09:45:15 AM IST

Maitripala-sirisena
శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా నేడు మైత్రిపాల శిరిసేన అధికారం చేపట్టనున్నారు. కాగా శుక్రవారం ఉదయం నుండి మొదలైన ఎన్నికల కౌంటింగ్ లో ప్రధాన ప్రత్యర్ధి మైత్రిపాల శిరిసేన కన్నా రాజపక్స భారీ తేడాతో వెనుకబడ్డారు. ఈ నేపధ్యంగా రాజపక్స కౌంటింగ్ పూర్తి కాకుండానే తన ఓటమిని అంగీకరిస్తూ అధ్యక్ష భవనాన్ని విడిచి వెళ్లారు. ఇక దీనితో శ్రీలంక అధ్యక్షుడిగా నేటి సాయంత్రం మైత్రిపాల శిరిసేన బాధ్యతలు స్వీకరించనున్నారు.