బ్రహ్మోత్సవం షూటింగ్ కు నో చెప్పిన మహేష్

Sunday, November 22nd, 2015, 03:11:12 PM IST

mahesh-babu
శ్రీమంతుడు వంటి భారీ హిట్ తరువాత మహేష్ బాబు చేస్తున్న సినిమా ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దీనికి డైరెక్టర్. శ్రీమంతుడు హిట్ తరువాత ఆచి తూచి కధలను ఓకే చేస్తున్న మహేష్ శ్రీకాంత్ సినిమాకు ఓకే చెప్పాడు. మొదట కధలోని కొంత భాగం చెప్పి మిగిలిన భాగాన్ని సినిమా షూటింగ్ లో ఉండగా పూర్తి చేస్తానని చెప్పిన శ్రీకాంత్ చెప్పగా కొన్ని సీన్ల చిత్రీకరణలో మహేష్ అసంతృప్తి వ్యక్తం చేశాడట. దాంతో శ్రీకాంత్ ఆన్ లొకేషన్ లో కధను చక్కదిద్దే ప్రయత్నం చేయగా సరిగ్గా కుదరక ఇబ్బందిపడ్డాడట.

అది గమనించిన మహేష్ కాస్త గ్యాప్ తీసుకొని కధను పర్ఫెక్ట్ గా పూర్తిచేయమని..అప్పటివరకూ సినిమా షూటింగ్ ను కొద్దిరోజులు వాయిదా వేయమని తెలిపాడు. ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల షూటింగ్ కు విరామం ఇచ్చి కధలో మార్పులు చేసే పనిలో పడ్డాడు. మొత్తానికి మహేష్ సినిమాల స్క్రిప్ట్ విషయంలో మాత్రం చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాడన్నమాట. ఈ సినిమాని పీవీపీ నిర్మిస్తుండగా..మహేష్ సరసన సమంత, కాజల్, ప్రణీత నటిస్తున్నారు.