పంచె కట్టు, మీసాలతో అదిరిపోయిన మహేశ్ యాడ్ లుక్..!

Saturday, October 3rd, 2020, 05:00:09 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు డ్యూయల్ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. డ్యూయల్ రోల్ చేసేందుకు అసలు ఒప్పుకోని మహేశ్ ఓ యాడ్ కోసం డ్యూయల్ రోల్‌లో కనిపించి అభిమానులను సర్‌ప్రైజ్ చేశాడు. ‘ఫ్లిప్‌కార్ట్ ది బిగ్‌ బిల్లియన్‌ డేస్‌’ షురూ అంటూ చేసిన యాడ్‌లో మహేశ్ అన్న, తమ్ముడు గెటప్‌లలో కనిపించాడు. అన్న గెటప్‌లో పంచె కట్టులో మరింత స్టైలిష్‌గా కనబడిన మహేశ్, పెద్ద మీసాలు కూడా పెట్టుకుని కనబడడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి హిట్ కొట్టిన మహేశ్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాం దర్శకత్వంలో సర్కార్ వారి పాట అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ మూవీకి సంబంధించిన టైటిల్ లుక్, మోషన్ పోస్టర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.