“సర్కారు వారి పాట” వచ్చే ఏడాది సంక్రాంతి కే…ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

Friday, January 29th, 2021, 05:02:39 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం లో మహేష్ బాబు సరికొత్తగా కనిపించబోతున్నారు. బ్యాంకింగ్ రంగం లో జరిగే భారీ కుంభకోణాల నేపథ్యం లో చిత్రం కథ నడుస్తోంది. అయితే ఈ చిత్రం లో మహేష్ సరసన హీరోయిన్ గా కీర్తి సురేష్ మొదటి సారి నటిస్తోంది. ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కి విడుదల కావాల్సి ఉండగా, కరోనా లాక్ డౌన్ తో వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ చిత్రం ఇంకా షూటింగ్ కుడ్ పూర్తి కాకపోవడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు చిత్రం విడుదల అవుతుందా అంటూ ఎదురు చూస్తున్నారు.

అయితే సర్కారు వారి పాట వచ్చే ఏడాది సంక్రాంతి కి విడుదల అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన విడుదల తేదీ ను వెల్లడించింది. మహేష్ చేతిలో తాళాలు పట్టుకొని ఉన్న మాస్ పోస్టర్ తో ఈ చిత్రం విడుదల తేదీ ను ప్రకటించడం జరిగింది. ఈ సినిమా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శక నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు. మహేష్ బాబు పాన్ ఇండియా తరహా లో ఈ చిత్రం లో చూపించ బోతున్నట్లు వినికిడి. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్నారు.