మహేష్ “సర్కారు వారి పాట” షూటింగ్ షురూ..!

Monday, January 25th, 2021, 11:33:28 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా, కీర్తి సురేష్ హీరోయిన్ గా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ చిత్రం షూటింగ్ నేటి నుండి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన వీడియో ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. అయితే మహేష్ అభిమానుల కి ఈ విషయం నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే సరిలేరు నీకెవ్వరు చిత్రం తో మాంచి హిట్ కొట్టిన మహేష్, ఈ చిత్రం తో అటు క్లాస్ ఆడియెన్స్ ను, ఇటు మాస్ ప్రేక్షకులను అలరించనున్నారు.

ఈ చిత్రం లో బ్యాంకింగ్ రంగంలో జరిగే కుంభకోణాల గురించి దర్శకుడు పరశురామ్ చూపించనున్నారు. ఈ చిత్రానికి కథ బలం అంటూ పలువురు చెప్పుకొస్తున్నారు. అయితే మహేష్ ను ఈ చిత్రం లో సరికొత్త రూపం లో చూపించేందుకు పరశురామ్ సిద్దం అవుతున్నారు. ఈ చిత్రానికి సంగీతం తమన్ అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్, జీ ఎం బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు భారీ స్థాయి లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు భాషలో మాత్రమే కాకుండా, ఇతర భాషల్లో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం పై అటు అభిమానుల్లో, ఇటు ఫిల్మ్ నగర్ లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.