మహేష్ నెక్స్ట్ సినిమాకు కష్ఠాలు తప్పవా ?

Sunday, June 3rd, 2018, 12:47:07 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించే 25 వ సినిమాకు కష్టాలు మొదలయ్యాయి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా జూన్ 10 నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న సమయంలో ఈ సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ లో మహేష్ – వంశీ లతో సినిమా చేయాలనీ అనుకున్నాడు. కానీ అనూహ్యంగా ఈ సినిమా దిల్ రాజు, అశ్విని దత్ బ్యానర్ లోకి మారింది. దాంతో ఈ సినిమా విషయంలో న్యాయం కోసం పివిపి కోర్టుకు వెళ్ళాడు .. రేపు సోమవారం (5 జూన్) కోర్టు హియరింగ్ ఉంది. దాంతో ఈ సినిమా మొదలు పెట్టాలా లేదా అన్న విషయం పై క్లారిటీ రావాల్సి ఉంది. మహేష్ తో వంశీ చేసే సినిమా దిల్ రాజు, అశ్వినీదత్ బ్యానర్ లో కాకుండా పివివి బ్యానర్ లోనే చేయాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబుకు ఆ బ్యానర్ లో సినిమా చేయడం ఇంట్రెస్ట్ గా లేదని టాక్. ఇక ఈ సినిమాకు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ వర్క్ మొత్తం పివిపి బ్యానర్ లోనే చేసాడని, దానికి అయినా ఖర్చులన్నీ పివిపి భరించాడట .. ఇప్పుడు ఆ ఖర్చులన్నీ తీర్చాలని డిమాండ్ కూడా ఉంది. మరిన్ని సమస్యలతో ఈ సినిమా మొదలవుతుందా లేదా అన్నది అనుమానంగానే ఉంది . అందుకే మహెష్ కూడా తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ ని వేగంగా సిద్ధం చేయమని సుకుమార్ కు చెప్పాడట. దాంతో సుకుమార్ అదే పనిలో బిజీగా ఉన్నాడు. మరి మహేష్ 25 వ సినిమా విషయంలో ఇంకెన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి.