మహర్షి అమెరికా షెడ్యూల్ రద్దయింది?

Monday, September 17th, 2018, 10:29:31 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ని డెహ్రూడూన్ లో పూర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. తదుపరి షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేసారు. దాదాపు 25 రోజుల పాటు అమెరిలలో ఈ షెడ్యూల్ జరగనుందట. అయితే ఈ వారంలోనే అక్కడ షూటింగ్ మొదలు పెట్టాలని ప్లాన్ చేసారు కానీ కొన్ని కారణాల వల్ల అమెరికా ప్రయాణం రద్దయింది. దాంతో ఈ షెడ్యూల్ ని వచ్చే నెల మొదటి వారం నుండి ప్లాన్ చేస్తారట. మహేష్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కీ రోల్ పోషిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది కానుకగా ఏప్రిల్ 5న విడుదల చేస్తారట. ఈ సినిమా తరువాత మహేష్ 26 వ సినిమా డిసెంబర్ లో సెట్స్ పైకి రానుంది. సుకుమార్ దర్శకత్వం వహించనున్నాడు.