మహారాష్ట్రలో రేపటి నుంచి మహా జనతా కర్ఫ్యూ.. ఎలా ఉండబోతుందంటే?

Wednesday, April 14th, 2021, 03:00:11 AM IST

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు పెరుగుతుండడం, అందులో ఎక్కువ కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతుండడంతో మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించబోతున్నారని తెగ వార్తలు వినిపించాయి. అయితే మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై ఆ రాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ థాక్రే క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్ విధించడం లేదని కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపు రాత్రి 8 గంటల నుంచి లాక్‌ డౌన్‌ తరహా ఆంక్షలుంటాయని తెలిపారు. 15 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉంటుందని దానిని మహా జనతా కర్ఫ్యూగా సంబోధిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.

అయితే రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు, ప్రార్థనా మందిరాలు, థియేటర్లు, పార్కులు, జిమ్‌లు మూసి వేస్తున్నామని పెట్రోలు బంకులు, మెడికలు షాపులు, బ్యాంకింగ్‌ సంస్థలు పనిచేస్తాయని, హోటళ్లు, రెస్టారెంట్లలో పార్సిల్‌లకు మాత్రమే అనుమతిస్తున్నామని అన్నారుర్. అయితే అవసరమైతేనే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలని రాష్ట్రంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయని థాక్రే అన్నారు. తక్షణం ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్నిఆస్పత్రుల్లో పడకలు, ఆక్సిజన్‌ దొరకని దొరకని పరిస్థితి ఉందని తక్షణం ఆక్సిజన్‌ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. కర్ఫ్యూ కారణంగా పేదలకు 3 కిలోల గోధుమలు, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని థాక్రే తెలిపారు.