హైదరాబాద్ లో జనాభాతో పాటు ట్రాఫిక్ కూడా పెరుగుతుంది – హోంమంత్రి

Saturday, November 7th, 2020, 10:05:16 PM IST

మహానగరం హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరగడం పట్ల తెలంగాణ రాష్ట్ర హోమ్ మంత్రి మహమూద్ అలీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జనాభాతో పాటుగా ట్రాఫిక్ కూడా పెరుగుతుంది అని హోమ్ మంత్రి తెలిపారు. భారతదేశం లో హైదరాబాద్ పోలీసులకు మంచి పేరు ఉందని అలీ అన్నారు. నెక్లెస్ రోడ్ లో నిర్వహించిన వర్చువల్ రన్ ను ప్రారంభించిన మంత్రి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రాఫిక్ పోలీసులు రాత్రి పగలు కష్టపడి విధులు నిర్వహిస్తున్నారు అని అన్నారు.ట్రాఫిక్ పోలీసులను మనం గౌరవించుకోవాలి అని, అంతేకాక తల్లిదండ్రులు చిన్న పిల్లలకి వాహనాలను ఇవ్వకూడదు అని సూచించారు.