టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ కంటతడి…ఎందుకంటే?

Thursday, January 7th, 2021, 12:45:18 PM IST

ఆస్ట్రేలియా తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ మూడో మ్యాచ్ నేటి నుండి జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు గా జాతీయ గీతం అలపిస్తున్న సమయం లో మహ్మద్ సిరాజ్ కంటతడి పెట్టుకున్నారు. అయితే సిరాజ్ కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. షమీ కి గాయం అవ్వడం తో సిరాజ్ కి మూడో టెస్ట్ మ్యాచ్ లో అవకాశం వచ్చింది.

అయితే ఇటీవలే సిరాజ్ తండ్రి అనారోగ్యం కారణంగా కన్ను మూసిన సంగతి తెలిసిందే. అయితే క్వారంటైన్ నిబంధనల కారణం గా భారత్ కి తిరిగి వెళ్ళే అవకాశం లేకపోవడం తో మ్యాచ్ ఆడేందుకు సిద్దం అయ్యారు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందుగా జాతీయ గీతం ఆలపించే సమయం లో సిరాజ్ తన తండ్రిని గుర్తు చేసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ ఆరు పరుగులకు ఒక వికెట్ ను కోల్పోయింది. డేవిడ్ వార్నర్ ను సిరాజ్ పెవిలియన్ కి పంపాడు.