కలెక్టర్ కి కరోనా… ఆందోళనలో మంత్రులు, ఎమ్మెల్యేలు!

Tuesday, August 25th, 2020, 11:07:53 PM IST

ప్రపంచ దేశాలను భయ పెడుతున్న కరోనా వైరస్ మహమ్మారి, భారత్ లోనూ తన ప్రభావం ను చూపిస్తోంది. రోజుకి వేల సంఖ్యలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు, వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో సైతం అదే పరిస్తితి కొనసాగుతూ ఉంది. అయితే తెలంగాణ లో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కరోనా వైరస్ భారిన పడ్డారు. అయితే తాజాగా మహబూబ్ బాద్ జిల్లా కలెక్టర్ వీపి గౌతం కరోనా వైరస్ భారిన పడ్డారు.

అయితే గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కలెక్టర్ తాజాగా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించు కొగా, కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఈ కలెక్టర్ సోమవారం నాడు మంత్రులతో సమావేశం లో పాల్గొన్నారు. అయితే ఈ విషయం పలువురిని ఆందోళన కి గురి చేస్తోంది. సోమవారం నాడు జరిగిన సమావేశం లో మంత్రులు ఈటెల రాజేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకరరావు లతో పాటుగా, ఎంపీ కవిత, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, హరిప్రియ పాల్గొన్నారు. అయితే వీరు కూడా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేయించుకొనేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.