చంద్రబాబు కి మదనపల్లె డీఎస్పీ నోటీసులు… కారణం ఇదే!

Wednesday, September 2nd, 2020, 02:12:35 AM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి మదనపల్లె డీఎస్పీ నోటీసులు పంపారు. వైసీపీ నేతలు వేధింపుల కారణం గానే ఓం ప్రతాప్ మృతి చెందినట్లు ఇటీవల చంద్రబాబు నాయుడు తో పాటుగా నారా లోకేష్ మరియు వర్ల రామయ్య ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు తో పాటుగా వీరికి కూడా నోటీసులు మదనపల్లె డీఎస్పీ రవి మనోహర చారి తెలిపారు.

అయితే ఇందుకు సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉంటే వారం లోపు నేరుగా లేదా తమకు సంబందించిన వ్యక్తుల ద్వారా అందజేసి దర్యాప్తు కి సహయపడగలరు అని అన్నారు. గత నెల లో ఓం ప్రతాప్ అనుమానాస్పద రీతి లో చిత్తూరు జిల్లాలో మృతి చెందిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ యువకుడు ఏపీ ప్రభుత్వం పై విమర్శించిన ఒక వీడియో సోషల్ మీడియా లో వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం పలు ఆరోపణల తర్వాత ప్రతాప్ మృతి చెందారు. అయితే మదనపల్లె డీఎస్పీ ను ఈ కేసు కోసం నియమించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో టీడీపీ కి చెందిన పలువురి కి నోటీసులు పంపారు.