ఆ హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు బెయిల్..!

Monday, August 24th, 2020, 06:20:06 PM IST

ex minister kollu ravindra

టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. ఇటీవల వైసీపీ మంత్రి పేర్ని నాని అనుచరుడు మోకా భాస్కరరావు హత్య కేసులో కొల్లు రవీంద్ర ప్రమేయం కూడా ఉందని తేలడంతో ఆయన పేరును కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చి ఆయనను అరెస్ట్ చేశారు.

అయితే ఈ కేసులో A-4 నిందితుడిగా ఉన్న కొల్లు రవీంద్ర గత కొద్ది రోజుల నుంచి జైలులోనే ఉండగా తాజాగా ఆయనకు బెయిల్ లభించింది. నేడు ఈ కేసుపై మరోసారి విచారించిన మచీలీపట్నం కోర్టు కొల్లు రవీంద్రకు ఊరట కల్పించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని కొల్లు రవీంద్రను ఆదేశించింది.