ప్రపంచంలోనే అత్యల్పంగా కరోనా మృతుల రేటు భారత్ దే…ఎంతంటే!

Thursday, July 30th, 2020, 11:08:27 PM IST


కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారత దేశం లో రోజురోజుకీ పెరుగుతోంది. ఊహించని రీతిలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. అయితే కరోనా వైరస్ రికవరీ లో మాత్రం భారత్ ముందు వరుస లో ఉందని చెప్పాలి. కరోనా వైరస్ మహమ్మారి భారిన పడి కోలుకున్న వారి సంఖ్య దేశం లో ఇప్పటి వరకూ పది లక్షలకు పైగా చేరింది. అయితే ఇది చాలా గొప్ప విషయం అని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఏప్రిల్ లో 7.85 శాతం గా ఉన్న రికవరీ రేటు, ప్రస్తుతం 64.4 శాతం గా ఉంది అని తెలిపారు.

అయితే కరోనా వైరస్ భారిన పడి రోజుకి వందల సంఖ్యలో మృతి చెందుతూ ఉన్నారు. కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ కూడా విడిచిపెట్టడం లేదు. అయితే కరోనా వైరస్ మరణాల రేటు దేశం లో ప్రస్తుతం 2.21 శాతం ఉంది అని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇది ప్రపంచం లోనే ఆత్యల్పం గా ఉన్న కరోనా వైరస్ మరణాల రేటు అని వివరించింది. అంతేకాక జూన్ లో 3.33 శాతం గా ఉంది అని తెలిపింది. అయితే ఈ మరణాల రేటు తగ్గడానికి గల కారణం క్లినికల్ మేనేజ్మెంట్ అని తెలిపారు.