టాలీవుడ్ ఇష్టమన్న ‘డర్టీ’ హీరోయిన్!

Friday, September 4th, 2015, 09:16:58 AM IST

vidya-balan
బాలీవుడ్ లో వరుసగా విజయాలను కైవసం చేసుకుని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సంపాదించుకున్న ‘డర్టీ పిక్చర్’ భామ విద్యాబాలన్ టాలీవుడ్ లో నేటించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. ఈ మేరకు ‘బాహుబలి’, ‘మగధీరా’ చిత్రాలను చూశానన్న విద్య మంచి స్క్రిప్ట్ వస్తే తెలుగులో నటించేందుకు తనకు అభ్యంతరం లేదని తెలిపింది. అలాగే బాహుబలి-2 చిత్రం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని కూడా ఈ బాలీవుడ్ బ్యూటీ పేర్కొంది. ఇక గతంలో తెలుగులో నటించేందుకు పలు అవకాశాలు వచ్చాయని, అయితే కొన్ని కారణాల వల్ల చెయ్యలేకపోయనని విద్యా బాలన్ చెప్పుకొచ్చింది.

అలాగే తనకు మలయాళం, తెలుగు చిత్రాలలో నటించాలని ఉందని ఈ ‘డర్టీ పిక్చర్’ హీరోయిన్ మనసులో మాట చెప్పింది. కాగా చిన్నతనంలో తన మావయ్య హైదరాబాద్ లో ఉండేవారని, అప్పుడు గోల్కొండను చూశానని, భాగ్యనగరంతో ఉన్న తన అనుబంధాన్ని విద్యా బాలన్ వివరించింది.