లోక్ సభ స్పీకర్ కి సోకిన కరోనా

Sunday, March 21st, 2021, 05:10:13 PM IST

భారత్ లో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతూనే ఉంది. అయితే రోజురోజుకీ దీని తీవ్రత పెరుగుతూనే ఉంది కానీ, ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే తాజాగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కి కరోనా వైరస్ సోకింది. అయితే తాజాగా జరిపిన కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలలో ఓం బిర్లా కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. తాజాగా కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడం తో ఢిల్లీ లోని ఎయిమ్స్ లో ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయనకు ఆరోగ్యం నిలకడగా ఉందని అంటున్నారు.