“మాస్టర్” డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా?

Sunday, January 3rd, 2021, 11:00:34 PM IST

దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసినవి కొద్ది సినిమాలే అయినప్పటికీ మాస్ సినిమాలు తీయడం తో ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిపోయింది అని చెప్పాలి. గతంలో తమిళ హీరో కార్తీ నటించిన ఖైదీ చిత్రం తెలుగు లో కూడా ప్రేక్షకులని ఆకట్టుకుంది. అయితే ప్రస్తుతం మాస్టర్ చిత్రం విడుదల కి సిద్దం అవుతుంది. హీరో విజయ్ తో తీసిన మాస్టర్ చిత్రం భారీగా విడుదల అయ్యేందుకు సిద్దం అవుతుంది. అయితే ఈ చిత్రం తో పాటుగా దర్శకుడు లోకేష్ కనగరాజు మరొక చిత్రాన్ని లైన్ లో పెట్టారు.

అయితే మరొక సినిమా సెట్స్ పై వుండగానే, లోకేష్ ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఒక స్టోరీ లైన్ వినిపించారట. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ మరియు లోకేష్ లు ఇద్దరు కూడా తమ తమ ప్రాజెక్టు లతో బిజీ గా ఉండటం కారణం గా వీళ్లిద్దరూ ఇప్పుడప్పుడే కలిసి పని చేసే అవకాశం లేదని చెప్పాలి. అయితే పూర్తి స్థాయిలో స్టోరీ ను సిద్దం చేసిన అనంతరం రామ్ చరణ్ కి వినిపించి ఒప్పించే పనిలో ఉన్నారు లోకేష్. ఇది గానీ నిజం అయితే రామ్ చరణ్ కి మరొక మాస్ బొమ్మ పడ్డట్టే. అయితే దీని పై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రౌద్రం రణం రుదిరం చిత్రం లో అల్లూరి సీతారామరాజు పాత్ర లో నటిస్తున్నారు. మరో పక్క కొరటాల శివ దర్శకత్వంలో తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో పాటుగా కలిసి నటిస్తున్నారు.