ఏపీ సర్కారుకు లోకాయుక్త నోటీసులు!

Wednesday, December 17th, 2014, 12:38:54 PM IST


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాల ఉల్లంఘనకు పాల్పడిందంటూ లోకాయుక్త బుధవారం నోటీసులు జారీ చేసింది. కాగా రాష్ట్ర విభజన నేపధ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలను ఉల్లంఘించిందంటూ తెలంగాణకు చెందిన అడ్వొకేట్ జనార్ధన్ గౌడ్ లోకాయుక్తను ఆశ్రయించారు. ఇక దీనిపై స్పందించిన లోకాయుక్త తెలంగాణకు రావాల్సిన విద్యుత్ ను ఎందుకు నిలిపివేశారో వెల్లడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఈ అంశంపై జనవరి 19 లోపల వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జారీ చేసిన నోటీసులో లోకాయుక్త పేర్కొంది.