తెలంగాణలో మొదలైన లాక్ డౌన్

Wednesday, May 12th, 2021, 11:35:54 AM IST

Hyderabad_lockdown

తెలంగాణ రాష్ట్రం లో లాక్ డౌన్ ప్రారంభం అయింది. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు సడలింపు లు ముగియడం తో 10 గంటల నుండి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే మహా నగరం హైదరాబాద్ తో పాటుగా మిగతా అన్ని జిల్లాల్లో ఉదయం 10 గంటలకే షాపులు మూతపడ్డాయి. ఇతర కార్యకలాపాలు సైతం నిలిచి పోయాయి. అయితే ఈ లాక్ డౌన్ కారణంగా చాలా మంది ప్రజలు తమ సొంత ఊళ్లకు పయనం అయ్యారు. రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో రద్దీ పెరిగింది. లాక్ డౌన్ ప్రారంభం కావడం తో రాష్ట్రం లోని బస్టాండ్ లు అన్ని కూడా నిర్మానుష్యం గా మారిపోయాయి. పలు ప్రధాన రహదారుల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను పోలీసులు కఠినంగా అమలు చేస్తున్నారు. అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు.

అయితే తెలంగాణ లో రెండో డోస్ వారికే వాక్సిన్ ఇవ్వనున్నారు. రెండో డోస్ కోసం పలు కేంద్రాల్లో భారీగా ప్రజలు క్యూ లైన్ లలో నిల్చున్నారు. కేవలం 4 గంటల సమయం మాత్రమే ఇవ్వడం తో కూరగాయల మార్కెట్ వద్ద ప్రజలు ఎక్కువగా గుమి గుడుతున్నారు. అంతేకాక అక్కడ ట్రాఫిక్ సైతం భారీగా పెరుగుతోంది. అయితే లాక్ డౌన్ కారణంగా తెలంగాణ లో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈ పది రోజుల పాటు నిలిపి వేస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు.