ఏపీ లో ప్రారంభం అయిన నామినేషన్ల ప్రక్రియ

Friday, January 29th, 2021, 01:30:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మొదలు అయింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3,249 గ్రామ పంచాయతి లకు, 32,504 వార్డ్ లకు మొదటి దశలో నిర్వహించే ఎన్నికల కోసం నామినేషన్ ల ప్రక్రియ మొదలు అయింది.అయితే 3,339 పంచాయతి లలో మొదటి విడత లో ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేయగా, పలు కారణాల వలన 90 పంచాయతి లలో ఎన్నికలు జరగడం లేదు. అయితే 33,496 వార్డు సభ్యుల స్థానాలకు 992 వార్డులు తగ్గాయి. ఇప్పటికే పెద్ద పంచాయతీ లలో రిటర్నింగ్ అధికారులను, పలు చోట్ల సహాయ రిటర్నింగ్ అధికారులని, స్టేజ్ 1 అధికారులను కలెక్టర్లు నియమించారు. వారికి శిక్షణ సైతం నిన్న పూర్తి అయినట్లు తెలుస్తోంది.

అయితే ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. ఆ సమయం వరకూ నామినేషన్ లను స్వీకరించడం జరుగుతుంది. అయితే నామినేషన్ లకు మూడు రోజుల గడువు ఉంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటల లోగా సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు నామినేషన్ వేసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గడువు ఇచ్చింది.