బావిలో మృగరాజు

Monday, November 3rd, 2014, 05:26:50 PM IST


గుజరాత్ లోని జునాగడ్ సిటీకి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్రాపూర్ గ్రామంలో ఆసియా జాతికి చెందిన సింహం బావిలో పడింది. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే అటవీసిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిబ్బంది.. మృగరాజును రెండు గంటలపాటు కష్టపది పైకి తీశారు. ఇక వివరాలలోకి వెళ్తే..

సోమవారం ఉదయం ఆసియా జాతికి చెందిన సింహం ఒకటి.. అమ్రాపూర్ గ్రామంలోని బావిలో పడిపోయింది. బావిలో పడ్డ మృగరాజును రక్షించేందుకు రేస్క్యుసిబ్బంది మొదట తాళ్ళతో పైకి లాగాలని చూశారు. కాని.. ఎంతకీ అది పైకి రాకపోవడంతో.. నులక మంచాన్ని తాళ్ళకి కట్టి బావిలోకి వదిలారు. సింహం ఆ మంచంపైకి రాగానే మెల్లిగా పైకి లాగి.. బోనులో ఎక్కించి ససాన్ గిర్ లోని జంతు సంరక్షణా కేంద్రానికి తరలించారు. అయితే.. సింహం ఆరోగ్య విషయాలను పరిశీలించిన అనంతరం అడవిలో వదులుతామని సిబ్బంది తెలియజేశారు.