భారత్ లో మరోసారి తగ్గిన కరోనా మరణాల రేటు!

Wednesday, August 12th, 2020, 01:51:18 AM IST


భారత దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నా, రికవరీ రేటు కూడా పెరగడం, మరణాల రేటు తగ్గడం ఉపశమనం కలిగించే అంశం అని చెప్పాలి. అయితే భారత్ తొలిసారిగా 2 శాతానికి దిగువగా కరిన మరణాల రేటు నమోదు అయిందని రాజేష్ భూషణ్ తెలిపారు. దేశం లో ప్రతి మిలియన్ జనాభా కి 18,320 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 15,83,489 మంది కరోనా వైరస్ భారీ నుండి కోలుకొని డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు.

దేశం లో క్లినికల్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా అమలు చేయడం వలన రికవరి రేటు భారీగా పెరిగింది అని అన్నారు.దేశం లో మరణాల రేటు 1.99 శాతంగా ఉంది అని తెలిపారు.అయితే పలు రాష్ట్రాల్లో ఇంకా కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు పెంచాలి అని మోడీ తెలిపారు. బీహార్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో పాజిటి విటి ఎక్కువగా ఉండటం చేత టెస్టుల పెంచుకోవాలని సూచించారు.