అనగనగ ఓ నది.. ఆ నదంతా వేడినీళ్ళే..!

Monday, February 22nd, 2016, 04:44:45 PM IST

hot-river
అనగనగా ఓ రాజు.. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు.. ఆ ఏడు మంది వేటకు వెళ్లి ఏడు చేపలు తెచ్చారు. ఈ కథను మన తాతలు.. అమ్మమ్మలు ఇలా ఎందఱో మనకు చెప్పగా మనం విన్నాం. ఇలాగే విదేశాలలోకూడా వాళ్ళ పెద్దవాళ్ళు.. పిల్లలకు కథలు చెప్తారు. అలాగే, పేరులో ఓ పెద్దయిన తన మనవడికి వేడినీళ్ళ నది గురించి ఓ కథలా చెప్పాడట. కాలక్రమేనా… ఆ విషయాన్ని ఆండ్రస్ రుజో మర్చిపోయాడు. పేరుకు చెందిన రుజో పెద్దవాడయ్యాక టెక్సాస్ లోని విశ్వవిద్యాలయంలో పీహెచ్ డి చేస్తున్నారు.

ఆ సమయంలో ఓ పెద్దావిడ రుజోతో వేడినీటి నది గురించి చెప్పింది. దీంతో రుజోకి ఆ నదిపై ఆసక్తి కలిగింది. ఈ నది గురించి చాలా మందిని అడిగితే.. సింపుల్ గా కొట్టిపడేశారు.. అటువంటి నదులు ఉండవని.. అగ్నిపర్వతాలు ఉన్నచోట అటువంటివి ఉంటే ఉండొచ్చని.. అమెజాన్ వంటి అడవుల్లో వేడినీటి నది ఉండటం అసంభవం అని కొంతమంది పేర్కొన్నారు. ఇక 2011 లో రుజో నదిని వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు.

అమెజాన్ అడవిలోని మయంటుయకు అనే ప్రాంతంలో వేడినీటి నదిని కనుగొన్నారు. సుమారు 4 మైళ్ళు పొడవు, 82 అడుగుల వెడల్పు 20 అడుగుల లోతున్న వేడినీటి నదిని కనుగొన్నాడు. ఇక ఈ నదిని గురించి రుజో ది బాయిలింగ్ రివర్… అడ్వెంచర్ అండ్ డిస్కవరీ అఫ్ అమెజాన్ అనే పుస్తకాన్ని రచించారు. సలసల కాగే ఈ నదిలో పొరపాటున దిగితే ఇక అంతే సంగతులు.