చంద్రబాబు పని అయిపోయింది – లక్ష్మీ పార్వతి

Sunday, March 14th, 2021, 09:00:16 PM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో వెలువడుతున్న పురపాలక ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ మరొకసారి దారుణ ఓటమి చవి చూస్తోంది. అయితే ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడెమీ ఛైర్మన్ లక్ష్మీ పార్వతి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తెలుగు దేశం పార్టీ కి చెంపపెట్టు అంటూ విమర్శించారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కి తన కొడుకును వారసుడు ను చేయాలన్న ఆశయం పోయింది అంటూ చెప్పుకొచ్చారు. ఆయన లాక్కున్న పార్టీని అడ్డం పెట్టుకొని సంపాదించుకున్నాడు అంటూ విమర్శించారు. అయితే ఇప్పుడు టీడీపీ పార్టీ ను భూ స్థాపితం చేశాడు అని, తండ్రీ కొడుకులు కూరగాయలు పాలు అమ్ముకోవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే తన భర్తకు చేసిన అవమానం ఇప్పుడు వాళ్లకు వచ్చింది అని లక్ష్మీ పార్వతి వ్యాఖ్యానించారు. సీఎం జగన్ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు అని, నిజమైన ఎన్టీఆర్ అభిమానులు అయితే ఇకనైనా చంద్రబాబు ను వదిలేయండి అంటూ సూచించారు. తెలుగు దేశం పార్టీ భవిష్యత్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం అని, మరో ముప్పై ఏళ్లు సీఎం జగన్ ప్రజలకు సేవ చేస్తారు అంటూ చెప్పుకొచ్చారు. తన భర్తను అవమానించిన పార్టీ ఉంటే ఏమిటి ఊడితే ఏమిటి అంటూ ఆగ్రహ వ్యక్తం చేశారు. చంద్రబాబు పని ఇక అయిపోయింది అని, ఆత్మ విమర్శ చేసుకోవడానికి తన మైండ్ కూడా చెడిపోయింది అంటూ చెప్పుకొచ్చారు.