ప్రభాస్ – నాగ్ అశ్విన్ సినిమా నుండి లేటెస్ట్ అప్డేట్స్

Friday, January 29th, 2021, 12:58:44 PM IST

పాన్ ఇండియా స్టార్ హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దీపికా పదుకునే హీరోయిన్ గా నాగ్ అశ్విన్ దర్శకత్వం లో సినిమా రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి సంబంధించి రెండు అప్డేట్స్ ను చిత్ర యూనిట్ నేడు ప్రకటించింది. నాగ్ అశ్విన్ మహానటి సినిమా తో టాలీవుడ్ లో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. మహానటి సినిమా ను అద్భుతంగా తెరకెక్కించడానికి కారణం అయిన డాని సాంచేజ్ లోపెజ్ (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ) ను మళ్ళీ ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం కోసం తీసుకున్నారు. అంతేకాక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ ను సంగీత దర్శకుడు కి తీసుకున్నారు.

అయితే అభిమానులు ఊహించిన దానికంటే ఒకేరోజు రెండు అప్డేట్స్ ఇవ్వడం పట్ల ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 500 కొట్ల రూపాయలకు పైగా బడ్జెట్ పెడుతున్నారు. ఈ చిత్రం పాన్ వరల్డ్ సినిమా గా విడుదల కానుంది. ప్రభాస్ సలార్ షూటింగ్ సైతం నేటి నుండి రామగుండం లో జరగనుంది. ఒకే సారి రెండు సినిమాలకు సంబంధించిన న్యూస్ రావడం పట్ల అటు ప్రభాస్ అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వరుస బిగ్గెస్ట్ ప్రాజెక్టు లతో ప్రభాస్ మరో మూడేళ్ల పాటు బిజీ గా ఉండనున్నారు.