పుష్ప నెక్స్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే?

Friday, December 4th, 2020, 05:26:18 PM IST

pushpa

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తున్న పుష్ప చిత్రం షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరగాల్సి ఉండగా, చిత్ర యూనిట్ లో ఒకరికి కరోనా వైరస్ పాజిటివ్ రావడం తో ప్యాక్ అప్ చెప్పారు. అంతా కూడా స్వీయ నిర్బంధం లోకి వెళ్ళారు. అయితే ఈ చిత్ర యూనిట్ నెక్స్ట్ షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 12 వ తేదీ నుండి జరగనున్నట్లు తెలుస్తోంది.

అయితే హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న అనంతరం భారీ షెడ్యూల్ ను జనవరి లో మారేడు మిల్లీ ప్రాంతంలో జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్లు విడుదల కాగా, అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీప్రసాద్ అందిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్, దేవి శ్రీ ప్రసాద్, అల్లు అర్జున్ కాంబినషన్లో ఇది మూడవ చిత్రం.