బిగ్ న్యూస్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న తెరాస..!

Friday, March 19th, 2021, 08:32:01 AM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అయితే నల్గొండ – ఖమ్మం – వరంగల్ మరియు మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ లలో ఇంకా ఏ పార్టీ కి కూడా పూర్తి మెజారిటీ దక్కలేదు. కాకపోతే రెండు స్థానాలకు గాను తెరాస అభ్యర్దులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. శుక్రవారం ఉదయం వరకు కూడా నల్గొండ స్థానం లో ఏడు మరియు హైదరాబాద్ స్థానం లో ఐదు రౌండ్ల లెక్కింపు పూర్తీ అయింది. అయితే నల్గొండ లో మొత్తం ఏడు రౌండ్ లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసే సరికి తెరాస అభ్యర్ధి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రత్యర్ధి స్వతంత్ర్య అభ్యర్ధి అయిన తీన్మార్ మల్లన్న పై 27,500 ఓట్లు ఆధిక్యం లో ఉన్నారు. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డి కి 1,10,840 ఓట్లు రాగా, తీన్మార్ మల్లన్న కి 83,290 ఓట్లు వచ్చాయి. తర్వాత కోదండరామ్ 70,072 ఓట్లు తో కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ప్రేమెందర్ రెడ్డి కి 39,107 రాగా, కాంగ్రెస్ అభ్యర్ధి రాములు నాయక్ కి 27,588 ఓట్లు నమోదు అయ్యాయి. అయితే మొత్తం ఏడు రౌండ్ లలో 21,636 చెల్లని ఓట్లు గుర్తించారు అధికారులు.

అయితే రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి.అయితే మెజారిటీ ఎవరికి రాకపోవడం తో తుది ఫలితాలు శనివారం కి వచ్చే అవకాశం ఉంది.