పవన్, రానా ల సినిమాకి ముహూర్తం రేపే

Sunday, December 20th, 2020, 06:32:57 PM IST

పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో మరొకసారి నటించేందుకు సిద్దం అవుతున్నారు. ఇదే చిత్రం లో రానా దగ్గుబాటి కూడా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పాత్రలతో వరుస సినిమాలు చేస్తున్నారు. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి పవర్ ఫుల్ కంటెంట్ తో దర్శకుడు గా మారిన సాగర్ కే చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అయ్యపన్ కోషియుం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం రీమేక్ లో నటించడం తో పవన్ మరొకసారి ఇండస్ట్రీ పై దండయాత్ర చేయనున్నారు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ చిత్రానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21 న ఈ చిత్రం మొదలు కానుంది. అయితే పవన్ కళ్యాణ్, రానా ఇద్దరు తొలిసారిగా కలిసి నటించడం తో ఈ చిత్రం పై అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం కోసం పవన్ మరియు రానా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ తో పాటుగా, హరీష్ శంకర్, క్రిష్ లతో కూడా సినిమాలు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అయితే అయ్యపన్ కోషియుం చిత్ర రీమేక్ కి సంగీతం తమన్ అందిస్తున్నారు. ఈ చిత్రం సితార ఎంటర్టైనమెంట్ బ్యానర్ పై తెరకెక్కనుంది.