బిగ్ న్యూస్ : తెలంగాణాలో మరోసారి రికార్డు బ్రేకింగ్ కరోనా కేసులు.!

Saturday, August 8th, 2020, 01:09:59 PM IST

ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభణ తారా స్థాయిలో నమోదు అవుతుంది. ఇప్పటికే ఏపీలో ఎన్నడూ లేని విధంగా రోజుకు పదేసి వేలు పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా ఇప్పటికే నేషనల్ మీడియాలో కూడా ఈ అంశం హైలైట్ అయ్యింది. ఇక అలాగే మరోపక్క తెలంగాణాలో కూడా భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్నాయి.

సగటున 20 వేలు టెస్టులు చేస్తే 2 వేలు కేసులు ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. అలా ఇప్పుడు నమోదు కాబడిన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 23 వేల 322 శాంపిల్స్ పరీక్షించగా 2 వేల 256 పాజిటివ్ కేసులు నమోదు అయ్యినట్టుగా తెలిపారు. దీనితో తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య 77 వేల 513కు చేరుకుంది.

అలాగే 1091 మంది డిశ్చార్జ్ కాగా 14 మంది మరణించినట్టుగా రాష్ట్ర వైద్య శాఖా మంత్రి వెల్లడించారు. అయితే ఈసారి జిహెచ్ఎంసి పరిధిలో భారీగా 464 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 181 మేడ్చల్ లో 138 అలాగే కరీంనగర్ లో 101 సరికొత్త కేసులు భారీ ఎత్తున నమోదు అయ్యాయి.