బ్రేకింగ్ : ఏపీలో మరో సారి భారీ ఎత్తున కరోనా కేసులు..!

Saturday, July 4th, 2020, 01:59:19 PM IST

ఏపీలో కరోనా వైరస్ ప్రభావం అలా కొనసాగుతూనే ఉందని చెప్పాలి. వాటికి తగ్గట్టుగానే ఆంద్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు కానీ మూమెంట్స్ కానీ ప్రత్యర్ధ పార్టీ నేతల చేత కూడా అభినందించబడ్దాయి. అంతే కాకుండా ఇప్పుడు ఏపీలో చర్యలు మరింత వేగవంతం అవ్వడానికి వైద్య రంగంలో కొత్త ఉద్యోగాలను కూడా ఇచ్చారు.

సో ఇక నుంచి మరింత స్థాయిలో పరీక్షలు కానీ కేసులు కానీ ఉంటాయని చెప్పాలి. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో ఏపీలో నమోదైన కరోనా లెక్కలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. గత 24 గంటల్లో మొత్తం 26 వేల 962 శాంపిల్స్ పరీక్షించగా ఒక్క ఏపీలో మొత్తం 727 పాజిటివ్ కేసులు వచ్చాయి.

అలాగే ఇతర రాష్ట్రాలు మరియు దేశాల నుంచి వచ్చిన వారితో కలిపి 765 కేసులు నమోదు అయ్యాయి. దీనితో ఏపీలో మొత్తం కేసులు 15 వేల 141 కి చేరుకున్నాయి. అలాగే గడిచిన 24 గంటల్లోనే మొత్తం 311 మంది డిశ్చార్జ్ కాగా ఏకంగా 10 కరోనా తో మరణించారు.