బ్రేకింగ్ : తెలంగాణలో మరోసారి భారీ ఎత్తున కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే.!

Sunday, August 2nd, 2020, 10:06:08 AM IST

ప్రస్తుతం అన్ని సమస్యలతో పాటు కరోనా కూడా మానవుల జీవితంలో ఒక భాగం అయ్యిపోయింది. దీనితో రోజు అన్ని పనుల్లానే కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య కూడా అలాగే వస్తూ ఉంది. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది.

తాజాగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వారు గత 24 గంటల్లో నమోదు అయిన కరోనా కేసుల సంఖ్యను విడుదల చేసారు. గత 24 గంటల్లో 19 వేల 202 శాంపిల్స్ పరీక్షించగా అందులో 1,891 పాజిటివ్ కేసులు వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీనితో తెలంగాణలో ఇప్పటి వరకు 66 వేల 677 కేసులు నమోదు అయ్యాయి.

అలాగే గత 24 గంటల్లో 1088 మంది సంపూర్ణ ఆరోగ్యంతో రికవర్ కాగా 10 మంది మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖవారు వెల్లడించారు. అలాగే జిహెచ్ఎంసి పరిధిలో 517 కేసులు నమోదు కాగా రంగారెడ్డి లో 181 కేసులు భారీగా నమోదు అయ్యాయి.