బ్రేకింగ్ : తెలంగాణాలో తాజాగా నమోదైన కరోనా లెక్కలు ఇవే.!

Tuesday, August 4th, 2020, 11:01:07 AM IST

Telangana_covid

ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా లెక్కలు లలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. లెక్కలు తక్కువ వస్తున్నాయి అంటే ఆరోజు పరీక్షలు తగ్గించారని ఎక్కువ వస్తున్నాయి అంటే పరీక్షలు ఎక్కువ చేస్తున్నారని ఒక అంచనా రాష్ట్ర ప్రజలకు వచ్చేసింది. అలా ఇప్పుడు లేటెస్ట్ గా తెలంగాణలో కరోనా కేసులు తాజా లెక్కల వివరాలు తాలూకా బులిటెన్ బయటకు వచ్చింది.

గడిచిన 24 గంటల్లో తెలంగాణలోని 13 వేల 787 శాంపిల్స్ పరీక్షించగా అందులో మొత్తం 1286 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ అయ్యింది. దీనితో తెలంగాణాలో మొత్తం కేసుల సంఖ్య కాస్తా 68 వేల 946 కు చేరుకుంది. అలాగే గడిచిన 24 గంటల్లో 1066 మంది పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్ కాగా మొత్తం 12 మంది మరణించినట్టుగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వారు వెల్లడించారు. అయితే ఈసారి జిహెచ్ఎంసి పరిధిలో భారీ ఎత్తున 391 కేసులు నమోదు కాగా రంగారెడ్డిలో 121 కరీంనగర్ లో 101 కేసులు నమోదు అయ్యాయి.