పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్లకి నేడు చివరి రోజు

Tuesday, February 23rd, 2021, 09:55:22 AM IST

తెలంగాణ రాష్ట్రం లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మొదలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే నామినేషన్లు వేసేందుకు నేడు ఆఖరు తేదీ. హైదరాబాద్ – మహబూబ్ నగర్ – రంగారెడ్డి ఎమ్మెల్సీ కి నామినేషన్ లు దాఖలు చేయనున్నారు. అయితేే నిన్న అఫిడవిట్ సరిగా లేని కారణంగా ఈరోజు మరొకసారి సురభి వాణిదేవి నామినేషన్ వేయనున్నారు. అయితే నేడు తెలుగు దేశం పార్టీ తరపున ఎల్. రమణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే నామినేషన్ ప్రక్రియ నేపథ్యం లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ గాపోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అటు అధికార పార్టీ తెరాస కి, ఇటు ప్రతి పక్షాలకు కీలకం కానున్నాయి.