భారత్‌లో కరోనా మరణమృదంగం.. 24 గంటల్లో 1092 మంది మృతి..!

Wednesday, August 19th, 2020, 11:00:52 AM IST

భారత్‌లో కరోనా కేసులు, మరణాలు రెండు రోజులుగా తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరిగాయి. ఓ పక్క రికవరీలు పెరుగుతున్నా మరో పక్క కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 64,531 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

ఇప్పటి వరకు మొత్తం 27,67,273 కరోనా కేసులు నమోదు కాగా ప్రస్తుతం అందులో 6,76,514 యాక్టివ్ కేసులు ఉండగా, 20,37,870 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గడిచిన 24 గంటల్లో కరోనాతో 1092 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 52,889కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా 8,01,518 కరోనా టెస్టులు చేశారు. ఇక దేశంలో కరోనా రికవరీ రేటు 73.6 శాతం ఉండగా, మరణాల రేటు 1.9 శాతంగా ఉంది.