విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగిపడిన కొండచరియలు..!

Wednesday, October 21st, 2020, 05:05:50 PM IST

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొండ చరియలు విరిగిపడ్డాయి. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బీటలు వారి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. అయితే ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు భావిస్తున్నారు. అయితే కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని ముందే హెచ్చరించినా అధికారులు మాత్రం కేవలం అక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టి వదిలేసినట్టు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే మరికాసేపట్లో సీఎం జగన్ ఇంద్రకీలాద్రికి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సీఎం జగన్ పర్యటన కాస్త ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది. సీఎం జగన్ రావడానికి కొద్ది గంటల ముందుగానే ఈ ప్రమాదం జరగడంతో అధికారులు వెంటనే సహాయక చర్యలు ముమ్మరం చేశారు. అయితే విరిగిపడ్డ కొండ చరియలు తీసేసిన అనంతరం సీఎం జగన్ ఇంద్రకీలాద్రి చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.