కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏం చేశాడు – లక్ష్మీ పార్వతీ

Sunday, December 13th, 2020, 04:09:03 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు అకాడెమీ చైర్మన్ లక్ష్మీ పార్వతీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హెరిటేజ్ మొదట్లో నష్టాల్లో ఉండేది అని, మోహన్ బాబు కి డైరెక్టర్ ఇస్తామని పెట్టుబడులు పెట్టించి ఆ తర్వాత బయటికి తోశారు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అయితే హెరిటేజ్ పాపాలు అన్ని ఇన్ని కావు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అందులో మొత్తం కల్తీ సరుకులే విక్రయిస్తారు అంటూ లక్ష్మీ పార్వతీ ఆరోపించారు. చంద్రబాబు నాయుడు అవినీతి చేసి వేల కోట్లు రూపాయలు సంపాదించి హెరిటేజ్ లో పెట్టుబడులు పెట్టారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఈ హెరిటేజ్ డెయిరీ కోసమే విజయ డెయిరీ తో పాటుగా మిగతా డెయిరీ లను నాశనం చేశారు అంటూ ఆరోపణలు చేశారు.అయితే సంఘం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు అని, అమూల్ చిన్న సంస్థ కాదు అని, పాడిపంటలను నమ్ముకున్న మహిళల అభివృద్ది కోసమే అమూల్ తీసుకు వచ్చామని అన్నారు. కుప్పం ప్రజలకు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటూ సూటిగా ప్రశ్నించారు. అంతేకాక సీఎం జగన్ గెలిచిన అనంతరం నుండి చంద్రబాబు కి ఏడుపులే మిగిలాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.