చంద్రబాబు ను జైలుకి పంపే వరకు వదిలేది లేదు

Friday, October 9th, 2020, 11:31:28 PM IST


తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతి పక్ష పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మరొకసారి లక్ష్మీ పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు ను జైలుకి పంపే వరకు వదిలేది లేదు అని తేల్చి చెప్పారు. చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసు విషయం లో లక్ష్మీ పార్వతి ఇలా అన్నారు. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఏసీబీ కోర్టు లో న్యాయం జరగక పోతే హై కోర్ట్ కి, అక్కడ కూడా న్యాయం దక్కకుంటే సుప్రీం కోర్టు కి వెళ్తా అని తెలిపారు. అంతేకాక గతం లో చంద్రబాబు నాయుడు తనకు ఫోన్ చేసి కేసు విత్ డ్రా తీసుకోమని వత్తిడి చేసిన విషయాన్ని వెల్లడించారు.

అయితే ఇది ఇలా ఉండగా, చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల కేసు విచారణ ఈ నెల 21 కి వాయిదా పడింది. చంద్రబాబు నాయుడు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారు అని, ఆయన ఆస్తుల పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని లక్ష్మీ పార్వతి పిటిషన్ లో కోరారు. 1978 నుండి 2005 వరకు చంద్రబాబు కి సంబంధించిన ఆస్తుల వివరాల్ని లక్ష్మీ పార్వతి కోర్టు కి అందజేశారు.