నిమ్మగడ్డ తెలివితేటలు ఏమయ్యాయి

Monday, January 25th, 2021, 09:43:54 AM IST

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్వతి, ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పై, నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కారణం గానే వ్యవస్థ భ్రష్టు పడుతుంది అని, ప్రజల కోసం మనమా లేక మన కోసం ప్రజలా అనే పరిస్తితి నేడు నెలకొంది అని పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ జీవించి ఉన్న సమయం లో నిమ్మగడ్డ ఎంతో మంచి గా ఉండేవారు అని అన్నారు. అయితే నేడు రాజ్యాంగ బద్ధ పదవిలో ఉండి, చంద్రబాబు చేతిలో పావుగా మారడం బాధాకరం అంటూ చెప్పుకొచ్చారు.

ఈ సమయం లో నిమ్మగడ్డ తెలివి తేటలు ఏమయ్యాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఎన్నో ఏళ్ల పాటు సంపాదించుకున్న మంచి పేరు ప్రస్తుతం కోల్పోతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.అయితే ఇప్పటికైనా మంచి వ్యవస్థకి నాంది పలికేందుకు చంద్రబాబు కబంధ హస్తాల నుండి బయటికి రావాలి అని అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు ఆత్మ విమర్శ చేసుకొనే పరిస్థితులు ఉండవు అని, అనుకున్నదే నిజం చేయాలని అనుకుంటారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అధికారం లో ఉన్నప్పుడు అవినీతి, అక్రమాలు, ప్రతి పక్షం లో ఉన్నప్పుడు నీచ రాజకీయాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.