చంద్రబాబుకు ఆ వ్యాది ఉందా..?

Tuesday, December 22nd, 2015, 06:39:07 PM IST

babukvp

టీడీపీ అదినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారిపై పొలిటికల్ వర్గాల్లో ఓ కొత్త పుకారు చక్కర్లు కొడుతోంది. ఆయనకు ‘అల్జీమర్స్’ వ్యాది ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో బాబు కొత్త ఇబ్బందుల్లో పడ్డారు. ఇదేదో ప్రత్యర్థులు పుట్టించిన పుకారైతే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడూ సీరియస్ గా ఉంటూ రాజకీయాలు తప్ప మరో విషయాల జోలికి పోని కాంగ్రెస్ నేత ‘ కేవీపీ రామచంద్ర రావు’ చెప్పడంతో ఈ విషయం కాస్త సీరియస్ అయింది. దీంతో జనాలు నిజంగా సీఎం కు అల్జీమర్స్ వ్యాది ఉందా..? అని అనుమానపడుతున్నారు.

అమరావతి నిర్మాణం గురించి కేంద్రానికి చేసిన పిర్యాదుపై మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. చంద్రబాబు గారికి అల్జీమర్స్ వ్యాది ఉందా..? లేదా అన్న విషయం పక్కన పెడితే అసలు ఆయన వ్యక్తిగత విషయాలు ఇలా బయటకు ఎలా వస్తున్నాయన్న అనుమానం వస్తోంది. ఒక సీఎం అంతరంగిక, వ్యక్తిగత విషయాలు తెలుసుకోవటం ఇంత సులభమైనప్పుడు ఆయనకు ప్రమాదం కలగటం కూడా సులభమే.

చంద్రబాబు గారి చుట్టూ ఉన్న ఆయన సన్నిహితుల్లోనే ఎవరో కోవర్టులుగా పనిచేస్తున్నారన్న విషయం ఈ పుకారుతో ఖారారైంది. దీన్ని ఆయన ఓ హెచ్చరికగా తీసుకొని ఆయన చుట్టూ ఉన్న ప్రత్యర్థి కోవర్టులను కనుగొని వారిని దూరం పెడితే భవిష్యత్తులో ఆయనకు చాలా మంచిది.