గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకి రుణాలు అందించాం – మంత్రి కన్నబాబు

Wednesday, September 2nd, 2020, 03:00:20 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మంగళవారం నాడు మీడియా సమావేశం లో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫీటిలైజర్స్ విషయం తో ఎవరైనా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో ఎరువుల కొరత లేదు అని, అవసరానికి మించిన ఫెర్టి లైజర్స్ అందుబాటులో ఉన్నాయి అని మంత్రి స్పస్తం చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అన్ని చోట్ల కూడా వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి అని, 80 శాతం మేర నాట్లు పడ్డాయి అని తెలిపారు. దాన్యం కొనుగోళ్ల విషయం లో అక్రమాల కి పాల్పడితే సహించేది లేదని, గతం లో ఎన్నడూ లేని విధంగా రైతుల కి రుణాలు అందించాం అని అన్నారు. అంతేకాక రైతు భరోసా కేంద్రాల నిర్మాణం డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం అని అన్నారు. ఈ కేంద్రాల్లో పాల సేకరణ కి తగు చర్యలు తీసుకుంటామని, అంతేకాక వ్యవసాయ శాఖ కి చెందిన గ్రామ కార్య దర్శి లని వేరే పనులకు అప్పగించవద్దు అని జేసీ లకు మంత్రి కురసాల కన్నబాబు ఆదేశాలను జారీ చేశారు.