న్యాయవాద దంపతుల హత్యకేసు నిందితుల అరెస్ట్..!

Thursday, February 18th, 2021, 07:32:03 PM IST

పెద్దపల్లి జిల్లాలో నిన్న జరిగిన న్యాయవాద దంపతుల హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే వామన్ రావు దంపతులను హత్య చేసిన ఘటనాస్థలంలో ఐదుగురు వ్యక్తులు ఉన్నట్లు తేల్చి ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా ఈ హత్య కేసులో ఏ2గా ఉన్న టీఆర్ఎస్ నేత కుంట శ్రీనివాస్‌ను మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని కుల దేవత గుడి వివాదమే ఈ హత్యకు ప్రధాన కారణమనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే నిన్న పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద కారులో వెళ్తున్న న్యాయవాద దంపతులను విచక్షణారహితంగా నరికి చంపారు. ఈ హత్యలను నిరసిస్తూ తెలంగాణతో పాటు ఏపీలోనూ న్యాయవాదులు ఆందోళన బాటపట్టారు. అటు రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు కూడా దీనిపై మాట్లాడుతూ అధికార టీఆర్ఎస్ పార్టీపై, పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నాయి.