గుండె తరలింపు కి సహకరించిన వారికి అభినందనలు

Wednesday, February 3rd, 2021, 12:48:38 PM IST

హైదరాబాద్ లోని నిన్న మెట్రో లో నాగోల్ నుండి జూబ్లీ హిల్స్ కి గుండె తరలించిన విషయం అందరికి తెలిసిందే. అయితే గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి గుండె తరలింపు కి సహకరించిన మెట్రో అధికారులకు కేటీఆర్ అభినందనలు తెలియజేశారు. అయితే యాదాద్రి భువనగిరి, ఆరె గూడెం గ్రామం కి చెందిన నర్సిరెడ్డి బోరు డ్రిల్లర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే ఆదివారం మోత్కూరు లో పెట్రోల్ బంకు కి వెళ్లి హై బీపీ తో అక్కడ పడిపోయారు.

అయితే ప్రాథమిక చికిత్స అనంతరం నర్సిరెడ్డి ను హైదరాబాద్ లోని కామినేని ఆసుపత్రి కి తరలించడం జరిగింది. మెదడు లో రక్త స్రావం అయి, బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్దారించారు. అయితే జీవన్ దాన్ ట్రస్ట్ కి చెందిన పలువురు సమాచార అందడం తో కుటుంబ సభ్యులను సంప్రదించారు. అయితే అవయవ దానం తో కొందరిని రక్షించ వచ్చు అంటూ వారు కుటుంబ సభ్యులతో చెప్పడం తో అందుకు అంగీకరించారు. అయితే గుండెను మెట్రో రైలు లో అపోలో ఆసుపత్రి కి తరలించి అక్కడ ఒక 44 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. మిగతా అవయవాలను గ్రీన్ ఛానల్ ద్వారా ఇతర ప్రాంతాలలోని ఆసుపత్రులకు తరలించారు.