కొమరం భీం స్పూర్తితో పనిచేస్తాం : కేటిఆర్

Sunday, February 1st, 2015, 04:45:19 PM IST


తెలంగాణ ఐటి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కెటిఆర్ ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని.. తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యం అని కేటిఆర్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు తమపై ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో ఆదిలాబాద్ జిల్లాను పట్టించుకోలేదని అన్నారు. ఇక ఆదిలాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం 57కోట్ల రూపాయలను కేటాయించినట్టు కెటిఆర్ స్పష్టం చేశారు. ఇక తెలంగాణలో ప్రభుత్వం చెప్పినట్టు హరితహారమ్ ఏర్పాటు చేస్తుందని కేటిఆర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.