ఢిల్లీ నుండి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ స్వాగతం.. కేటీఆర్ సెటైరికల్ ట్వీట్..!

Wednesday, November 25th, 2020, 09:09:31 PM IST

గ్రేటర్ ఎన్నికలలో భాగంగా ప్రచారానికి బీజేపీ నుంచి అగ్రనేతలు, కేంద్ర మంత్రులు హైదరబాద్‌కు వస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వి సూర్య నగరంలో పర్యటించారు. త్వరలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీజేపీ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్రహోంమంత్రి అమిత్ షా కూడా వస్తున్నట్టు తెలుస్తుంది.

అయితే దీనిపై ట్విట్టర్ ద్వారా స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరద లాగా ఢిల్లీ నుండి దిగుతున్న కేంద్ర మంత్రులందరికీ హైదరాబాదుకు స్వాగతమని, ఈ రాక ఏదో, నగరం అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వస్తే బాగుండేదని అన్నారు. అయితే ఉత్త చేతులతో రాకుండా, వస్తూ వస్తూ సీఎం కేసీఆర్ గారు విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరద సాయంగా రూ.1350 కోట్లు తీసుకువస్తున్నారని ఆశిస్తున్నట్టు కేటీఆర్ కోరారు.