గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే పాతబస్తీ లో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్తాన్ వాసుల ఓట్లతో ఎంఐఎం, టీఆర్ఎస్లు గెలవాలని చూస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. అయితే బండి సంజయ్ ఆరోపణలకు మంత్రి కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పచ్చని హైదరాబాద్‌ను పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా అని నిలదీశారు. సర్జికల్ స్ట్రయిక్ చేయడానికి హైదరాబాద్ దేశ సరిహద్దుల్లో లేదు, శత్రుదేశంలో అంతకన్నా లేదని అన్నారు.
అంతేకాదు బీజేపీ సర్జికల్ స్ట్రయిక్ చేయాల్సింది వెనకబాటుతనంపై, మత విద్వేషాలపై, ఆడపిల్లలపై అఘాయిత్యాలు చేస్తున్న వారిపై, తప్పుడు నిర్ణయాలతో ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన వాళ్లపై, పరుగులు పెడుతున్న దేశాన్ని అడ్డంగా పడుకోబెట్టిన వాళ్లపై చేయండని అన్నారు. ఇవన్ని మీకు చేతకావనే విషయం ప్రజలకు అర్థమైపోయిందని, అందుకే మీ అసమర్థత పాలనపై దేశప్రజలు చేస్తారు సర్జికల్ స్ట్రయిక్ అని ట్వీట్ చేశారు.
పచ్చని హైదరాబాద్ ను..పాకిస్తాన్ లోని ఉగ్రవాద స్థావరాలతో పోలుస్తారా..?
హైదరాబాద్ పై సర్జికల్ స్ట్రయిక్ చేస్తుందట బీజేపీ
సర్జికల్ స్ట్రయిక్ చేయడానికి హైదరాబాద్.. దేశ సరిహద్దుల్లో లేదు
శత్రుదేశంలో అంతకన్నా లేదు#NoHatePolitics— KTR (@KTRTRS) November 24, 2020