కేంద్ర ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ మంత్రి కేటీఆర్..!

Tuesday, March 9th, 2021, 03:00:43 AM IST


కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం అందడంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. విభజన చట్టం హామీలను సైతం కేంద్రం తుంగలో తొక్కుతుందని ఆరోపించారు. అయితే భారీగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన తమ ప్రభుత్వంపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15 వేలకు పైగా కంపెనీలకు అనుమతులు ఇచ్చి, సుమారు 15 లక్షల ఉపాధి అవకాశాలను సృష్టించగలిగామని కేటీఆర్ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లో నిత్యం ఘర్షణలు ఉండేవని, ఆరున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో కర్ఫ్యూ పెట్టే పరిస్థితి రాకుండా ప్రభుత్వం కట్టడి చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఇక మహిళలకు సంపూర్ణ భద్రత కల్పిస్తున్నామని, దిశ ఘటన తర్వాత స్పందన ఎలా ఉందో ప్రజలు చూశారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగయ్యాయని కేటీఆర్ అన్నారు.