తెలంగాణ ప్రజలకు మరో తీపికబురు చెప్పిన మంత్రి కేటీఆర్..!

Wednesday, July 8th, 2020, 02:58:03 PM IST

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ గారు తీపికబురు చెప్పారు. టీ-ఫైబర్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రంగంపేటలో 307 మంది గిరిజన రైతులకు పట్టాల పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన రాష్ట్రంలో టీ-ఫైబర్ పనులు వేగంగా సాగుతున్నాయని, ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పుకొచ్చారు.

ఇకపోతే భావి తరాలకు మంచి గాలి, ఆక్సిజన్‌ అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం ద్వారా పెద్దఎత్తున మొక్కలు నాటిస్తున్నారని అన్నారు. అడవులను పెంచడానికి రాష్ట్రం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ఎవరైనా అడవులను నరికితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కరోనా కష్ట సమయంలో కూడా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధును కూడా అందించామని అన్నారు.